Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. తీవ్ర ప్రభావం చూపుతున్న డెల్టా వేరియంట్

US Covid Cases Rising Rapidly
  • యూఎస్ లో అనేక ప్రాంతాల్లో నమోదవుతున్న డెల్టా వేరియంట్ కేసులు
  • సగానికి పైగా కరోనా కేసులు డెల్టా వేరియంట్ వే
  • రాబోయే రోజుల్లో మరింత ప్రమాదకారిగా మారుతుందన్న డాక్టర్ ఫౌచీ
కరోనా వైరస్ ధాటికి అగ్రరాజ్యం విలవిల్లాడిన సంగతి తెలిసిందే. ఊహించని సంఖ్యలో యూఎస్ లో మరణాలు సంభవించాయి. ఆ తర్వాత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని యూఎస్ ఒక యజ్ఞంలా చేపట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికాలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే, తాజాగా డెల్టా వేరియంట్ అమెరికాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో సగానికి పైగా డెల్టా వేరియంట్ వేనని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆఫ్ ప్రివెన్షన్ తెలిపింది. కరోనా వేరియంట్లలో డెల్టా చాలా స్పీడుగా ఉందని చెప్పింది.

అమెరికాలో అనేక ప్రాంతాల్లో డెల్టా వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. దాదాపు 80 శాతం కేసులు డెల్టా వేరియంట్ వే. కరోనా తొలి నాళ్లలో ఆల్ఫా వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదు కాగా... ఇప్పుడు వాటి సంఖ్య 28.7 శాతానికి తగ్గింది. డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అమెరికా వైద్య నిపుణులు డాక్టర్ ఫౌచి మాట్లాడుతూ... ఇది వేగంగా వ్యాప్తి చెందడమే కాకుండా, ఎక్కువ ప్రభావాన్ని కూడా చూపుతోందని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఈ వేరియంట్ మరింత ప్రమాదకారిగా మారుతుందని అన్నారు.

మరో కీలక విషయం ఏమిటంటే కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నవారికి కూడా మళ్లీ కరోనా సోకుతోంది. అయితే, ఇలాంటి కేసులు చాలా తక్కువగా ఉంటున్నాయి. వీరికి కరోనా సోకినా, ప్రాణగండం మాత్రం లేకపోవడం గమనార్హం.
USA
Corona Virus
Delta Varient

More Telugu News